JP Nadda Focus : తమిళనాడుపై జేపీ నడ్డా నజర్
అన్నాడీఎంకే బీజేపీ మధ్య వైరం
JP Nadda Focus TN : తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే పార్టీల మధ్య దూరం పెరుగుతోంది. పళనిస్వామి, కె. అన్నామలై మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా కలిసి ఉండేలా చేయాలని బీజేపీ హై కమాండ్ ఫోకస్ పెట్టనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో ఎలాంటి విరోధం లేకుండా ముందుకు సాగాలని పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda Focus TN) మార్చి 11న శనివారం తమిళనాడులోని 10 జిల్లాల్లో పార్టీ ఆఫీసులను ప్రాంరభించనున్నారు.
బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామలై అన్నాడీఎంకేతో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమావేశం ఉంటుందని సమాచారం లేనప్పటికీ అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో అమిత్ షా భేటీ కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర నాయకత్వం పార్టీ కేడర్ ప్రయోజనాలను పక్కదారి పట్టించిందని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం మాజీ చీఫ్ సీటీఆర్ నిర్మల్ కుమార్ తో పాటు పలువురు బీజేపీకి చెందిన నాయకులు అన్నాడీఎంకేలో చేరారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామలై. వేల మంది ప్రజలు ఒక పార్టీలో చేరతారు. వందల మంది ప్రజలు మరో పార్టీని విడిచి పెడతారు. రాజకీయాలు అంటే ఇలాగే ఉండాలని అన్నారు.
ఆయన చేసిన కామెంట్స్ ఎవరు వెళ్లినా పార్టీకి ఒరిగే నష్టం ఏమీ ఉండదని అర్ధం. ఇప్పటికీ అన్నామలై పై కేంద్రం పూర్తి భరోసా కలిగి ఉంది. ప్రధాని మోదీకి ఉన్న జనాదరణ ఉన్నా రాష్ట్రంలో అన్నాడీఎంకేతో కలిసి పోవాల్సిన అవసరం ఉందని మరో సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. నడ్డా ఏం చేస్తారనేది చూడాలి.
Also Read : బీజేపీకి ఎమ్మెల్సీ షాక్ కాంగ్రెస్ కు జంప్