Pawan Kalyan : హక్కుల కంటే ఐక్యత ముఖ్యం – పవన్
రాబోయే ఎన్నికల్లో బహుజనులే కీలకం
Pawan Kalyan OC Meet : ప్రముఖ నటుడు , జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బహుజనులే కీలకంగా మారనున్నారని స్పష్టం చేశారు. మన కోటా మన వాటా అన్న దిశగా ఆలోచించాలన్నారు. గతంలో పాలకులు , పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయన్నారు. హక్కుల కోసం కోకుండా ముందు ఐక్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
అవసరమైతే బహుజనుల కోసం , వారి అభ్యున్నతి కోసం తాను దీక్షను చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు జనసేనాని. ఒకవేళ జనసేన గనుక పవర్ లోకి వస్తే సగానికి పైగా పదవులన్నీ బహుజనులకే ఇస్తామని జోష్యం చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే అధికారంలోకి రావాలంటే కాపులు , బీసీలు ఐక్యం కావాలన్నారు. అలాగైతేనే మనం పవర్ లోకి రాగలుగుతామని చెప్పారు జనసేనాని.
అప్పుడు ఎవరినీ సీట్లు, పదవులు అడుక్కోవాల్సిన అవసరం ఉండదన్నారు పవన్ కళ్యాణ్. ఆదివారం మంగళగిరిలో జరిగిన జనసేన రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టారు. ఈ సందర్బంగా జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్ల పాటు బీసీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గతంలో 93 బీసీ కులాలు ఉండేవని కానీ అవి ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయో తెలియడం లేదన్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan OC Meet).
ఇదిలా ఉండగా ఏపీలో బీసీల ఓటు బ్యాంకు ఇప్పుడు కీలకం కానుంది. బీసీ జనాభా అత్యధికంగా ఉంది. వీరే ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల గెలుపుపై తీవ్ర ప్రభావం చూపనున్నారు. అధికార పార్టీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ వీరిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుండడం విశేషం.
Also Read : న్యాయ వ్యవస్థకు టెక్నాలజీ అవసరం