MLA Rajaiah : త‌ప్పైంది మ‌న్నించండి – రాజ‌య్య

ఆయ‌న స‌మక్షంలోనే న‌వ్య ఆరోప‌ణ‌

MLA Rajaiah Apologized : జాన‌కీపురం స‌ర్పంచ్ న‌వ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి. చివ‌ర‌కు దిగి వ‌చ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌(MLA Rajaiah). ఆదివారం స‌ర్పంచ్ న‌వ్య‌, భ‌ర్త‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. తన‌కు మ‌హిళ‌లంటే ఎన‌లేని గౌర‌వం ఉంద‌న్నారు. వారి అభివృద్దికి ఎంత‌గానో కృషి చేశాన‌ని చెప్పారు. తన‌పై కొంద‌రు దుష్ప్రచారం చేశార‌ని అదంతా అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. త‌న శ‌రీరంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు మ‌హిళ‌లు బాగుండాల‌ని కోరుకుంటాన‌ని చెప్పారు.

వారి సంక్షేమం కోసం తాను ఎల్ల‌వేళ‌లా పాటు ప‌డ‌తాన‌ని అన్నారు తాటికొండ రాజ‌య్య‌. గ‌తంలో కూడా చాలా ఆరోప‌ణ‌లు వ‌చ్చినా అవేవీ త‌న‌పై నిల‌వ‌లేద‌ని , నిరాధార‌మ‌ని తేలింద‌న్నారు. పార్టీ అన్నాక ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు మాజీ మంత్రి. ఊపిరి పోయేంత దాకా మ‌హిళ‌ల అభ్యున్న‌తే ఎజెండాగా తాను కృషి చేస్తాన‌ని చెప్పారు. తెలిసో తెలియ‌కో త‌ప్పులు చేసి ఉంటే త‌న‌ను ద‌య‌తో మ‌న్నించాల‌ని కోరుతున్నాన‌ని అన్నారు తాటికొండ రాజ‌య్య‌(MLA Rajaiah Apologized).

తాను మీడియా లోకం , ఊరి సాక్షిగా మ‌హిళా లోకాన్ని మ‌న్నించాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. ఇక నుంచి జాన‌కిపురం గ్రామం ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దేందుకు త‌న వంతు స‌హ‌కారం అంద‌జేస్తాన‌ని అన్నారు మాజీ మంత్రి.

త‌న ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 25 ల‌క్ష‌లు మంజూరు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇదిలా ఉండ‌గా తాటికొండ రాజ‌య్య స‌మ‌క్షంలోనే స‌ర్పంచ్ న‌వ్య కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌పై ఎవ‌రు చేయి వేసినా ఊరుకోన‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా స‌ర్పంచ్ చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి.

Also Read : క‌విత ఎమ్మెల్సీ కాదు లిక్క‌ర్ క్వీన్

Leave A Reply

Your Email Id will not be published!