TSPSC Leak : పేపర్ లీకేజీ బాధ్యత జనార్దన్ రెడ్డిదే
చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలి
TSPSC Leak : లక్షలాది మంది నిరుద్యోగల ఆశలపై నీళ్లు చల్లింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గవర్నర్ చైర్మన్ గా ఉన్న సదరు సంస్థ గత కొంత కాలం నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే చైర్మన్ ఎంపిక దగ్గరి నుంచి సభ్యుల నియామకం వరకు అన్నీ విమర్శలే. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అభ్యర్థులను ఎలా నియమించారంటూ మండిపింది. ఇది పక్కన పెడితే తాజాగా టీఎస్పీఎస్సీలో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ(TSPSC Leak) వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు . తిండి తిప్పలు మానేసి చదివినా తమకు జాబ్స్ రావడం లేదని అలాంటిది ప్రవీణ్ కు 100కు పైగా మార్కులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. పేపర్ లీకేజీకి(TSPSC Leak) కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ వెంటనే చైర్మన్ పదవి నుంచి దిగి పోవాలంటూ జనర్దన్ రెడ్డిని డిమాండ్ చేశారు నిరుద్యోగులు.
పెన్ డ్రైవర్ ద్వారా పేపర్ కాపీ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది బయటి వారికి సాధ్యం కాదని ఇదంతా సంస్థలోని ఉద్యోగుల నిర్వాకం వల్లనే జరిగిందని మండిపడ్డారు. తక్షణమే టీఎస్పీఎస్సీని యుపీఎస్స్సీకి అనుసంధానం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా గ్రూప్ -1 కు సంబంధించి కూడా పేపర్ లీక్ అయినట్లు అనుమానం తమకు కలుగుతోందన్నారు. నిరుద్యోగుల ఆందోళనకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు తెలంగాణ జన సమితి నేత కోదండ రామ్ .
Also Read : నల్సార్ లో కొలువుల మేళం