Nalsar Recruitment : న‌ల్సార్ లో కొలువుల మేళం

టీచింగ్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్

Nalsar Recruitment : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా న‌ల్సార్ విస్త‌రించి ఉంది. హైద‌రాబాద్ లోని న‌ల్సార్ కు చెందిన యూనివ‌ర్శిటీలో టీచింగ్ పోస్టుల‌కు సంబంధించి నోటిఫికేష‌న్(Nalsar Recruitment) విడుద‌ల చేసింది. అర్హులైన అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా మొత్తం 58 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇక భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల‌లో లా , మేనేజ్ మెంట్ విభాగంలో 10 ప్రొఫెస‌ర్ పోస్టులు ఉన్నాయి. ఇదే విభాగానికి సంబంధించి లా, నిర్వ‌హ‌ణ లో అసోసియేట్ ప్రొఫెస‌ర్ 12 పోస్టులను భ‌ర్తీ చేయ‌నునుంది న‌ల్సార్ యూనివ‌ర్శిటీ.

ఇక లా , మేనేజ్ మెంట్ , పొలిటిక‌ల్ సైన్స్ , ఎక‌నామిక్స్ విభాగాల‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ కు సంబంధించి 33 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇక డైరెక్ట‌రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ విభాగంలో డైరెక్ట‌ర్ పోస్టు కు ద‌ర‌ఖాస్తు స్వీక‌రించ‌నున్నారు. ఇక హెడ్ , కార్పొరేట్ ఇంట‌ర్ ఫేస్ విభాగానికి సంబంధించి ఒక పోస్టును భ‌ర్తీ చేయ‌నుంది. దీంతో పాటు ప్లేస్ మెంట్ ఆఫీస‌ర్ పోస్టు ఖాళీగా ఉంది.

ఇక ఆయా పోస్టుల‌కు సంబంధించి వివిధ విభాగాల‌లో ఉన్న‌త విద్యార్హ‌త‌లు క‌లిగి ఉండాలి. అంతే కాదు నెట్ , స్లెట్ , సెట్ అర్హ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది న‌ల్సార్(Nalsar Recruitment). ఇక జాబ్స్ కు సంబంధించి ఎంఫిల్ , పీహెచ్డీ, ఐజీడ‌బ్ల్యూఏ, సీఎంఏ పాసై ఉండాలి. అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి ఆయా విభాగాల‌లో. అద‌న‌పు అర్హ‌త‌లు ఉంటే జాబ్ తెచ్చుకునేందుకు వీలుంది.

ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్ లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫీజు విష‌యానికి వ‌స్తే జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ. 1,000 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , ఈడ‌బ్ల్యూఎస్ , దివ్యంగులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ప్ర‌తిభ ఆధారంగా భ‌ర్తీ చేస్తారు. ఈనెలాఖ‌రు వ‌ర‌కు చివ‌రి తేది.

Also Read : జీడీఎస్ రిజ‌ల్ట్స్ రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!