AP TS GDS Results 2023 : జీడీఎస్ రిజ‌ల్ట్స్ రిలీజ్

మెరిట్ ప్రాతిప‌దిక‌న ఎంపిక

AP TS GDS Results 2023 : భార‌త పోస్ట‌ల్ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన జాబ్స్ కు సంబంధించి మెరిట్ లిస్టు విడుద‌ల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు సంబంధించి వీటిని విడుద‌ల(AP TS GDS Results 2023) చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి మెరిట్ జాబితాల‌ను ప్ర‌క‌టించింది.

అన్ని స‌ర్కిళ్ల‌లో ఎంపికైన వారికి సంబంధించి ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది పోస్ట‌ల్ శాఖ‌. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం మార్కుల ఆధారంగా వీరిని ఎంపిక చేసింది. ఒక వేళ ఎవ‌రైనా అందుబాటులోకి రాక పోతే లిస్టులో రెండో వ్య‌క్తికి ప్ర‌యారిటీ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది.

ఇండియా పోస్ట్ గ‌త నెల‌లో 40,889 గ్రామీణ డాక్ సేవ‌క్ (జీడీఎస్), బీపీఎం పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి 2,480 పోస్టులు ఉండ‌గా తెలంగాణ‌లో 1,266 పోస్టులు ఉన్నాయి. కేవ‌లం 10వ త‌ర‌గ‌తిలో సాధించిన మార్కులతో పాటు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులకు సంబంధించి రిజ‌ర్వేష‌న్ ఆధారంగా వీరిని ఎంపిక చేసిన‌ట్లు పోస్ట‌ల్ శాఖ స్ప‌ష్టం చేసింది.

ఇదే స‌మ‌యంలో ఒక‌వేళ అభ్య‌ర్థులకు ఒకే మార్కులు ఉన్న‌ట్ల‌యితే వ‌య‌స్సు ఎక్కువ‌గా ఉన్న వారిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు తెలిపింది పోస్ట‌ల్ శాఖ‌. మార్చి 21 లోపు స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ కోసం హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ఎంపికైన వారికి నియామ‌క ఉత్త‌ర్వులు నేరుగా అంద‌జేస్తుంది.

పోస్ట‌ల్ శాఖ‌తో పాటు ఇండియ‌న్ పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవ‌లలో కూడా భాగం పంచు కోవ‌ల్సి ఉంటుంది. ఇక ఆయా మెరిట్ జాబితాకు సంబంధించి పోస్ట‌ల్ శాఖ ప్ర‌క‌టించిన ఫైన‌ల్ లిస్టు చూసుకోవాల‌ని కోరింది పోస్ట‌ల్ శాఖ‌.

Also Read : పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!