YS Sharmila : బీఆర్ఎస్ నేతలపై షర్మిల ఫిర్యాదు
ఢిల్లీ మహిళా కమిషన్ కు వినతి
YS Sharmila NCW : తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. ఆమె గత కొంత కాలం నుంచి రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ పై , సీఎం కేసిఆర్ , కల్వకుంట్ల కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. మార్చి 14న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని వాటిలో కీసీఆర్ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడిందంటూ ఆరోపించింది. ఇదే సమయంలో ధర్నాకు దిగిన ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
ఇదే సమయంలో ఢిల్లీ లోనే ఉన్న వైఎస్ షర్మిల అనూహ్యంగా రాష్ట్రంలో కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ను సంప్రదించలేదు. బుధవారం ఢిల్లీలో ఉన్న జాతీయ మహిళా కమిషన్ కు చేరుకున్నారు . మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను కలిశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila NCW). అసభ్య పదజాలంతో పాటు దాడులకు , హెచ్చరికలకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు మహిళలంటే చులకనగా ఉందని ఆరోపించారు. వెంటనే వారందరికీ నోటీసులు పంపించాలని చైర్ పర్సన్ ను కోరారు వైఎస్ షర్మిల. ఇదిలా ఉండగా షర్మిల ఇచ్చిన వినతిపత్రంపై తాను ఆలోచిస్తానని వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read : ఈడీ ముందుకు సోనియా వెళ్ల లేదా