Supreme Court : కోష్యారీ తీరుపై సుప్రీం కామెంట్స్

గ‌వ‌ర్న‌ర్ అధికారాన్ని జాగ్ర‌త్త‌గా వాడాలి

Supreme Court Koshyari : మ‌రాఠాలో చోటు చేసుకున్న గ‌వ‌ర్న‌ర్ , ప్ర‌భుత్వ వివాదంపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌వ‌ర్న‌ర్ కు విశిష్ట‌మైన అధికారులు ఉన్నాయి. వాటిని జాగ్ర‌త్త‌గా వాడుకోవాలి.

ప‌వ‌ర్ ఉంది క‌దా అని ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడ‌తారా అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గ‌త కొంత కాలం నుంచీ న్యాయ వ్య‌వ‌స్థ సీరియ‌స్ కామెంట్స్ చేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్లు రాజ‌కీయాల జోలికి వెళ్ల కూడ‌దంటూ హెచ్చ‌రించారు. సుతిమెత్త‌గా మంద‌లించారు సీజేఐ.

శివ‌సేన వ‌ర్సెస్ షిండే సేన కేసును బుధ‌వారం విచారించింది సుప్రీంకోర్టు. గ‌త ఏడాది ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపిన మ‌హారాష్ట్ర లో గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీ(Supreme Court Koshyari)  పాత్ర‌పై సీరియ‌స్ అయ్యారు సీజేఐ. ఏక్ నాథ్ సిండే తిరుగుబాటు త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కార్ అధికారాన్ని కోల్పోయింది.

ఈ సంద‌ర్బంగా కేసును విచారించిన ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. గ‌వ‌ర్న‌ర్ అధికారాన్ని జాగ్ర‌త్త‌గా వినియోగించు కోవాల‌ని , విశ్వాస ఓటింగ్ కు పిలుపునిస్తే ప్ర‌భుత్వాన్ని కూల్చే అవ‌కాశం ఉంద‌ని తెలుసు కోవాల‌న్నారు. ఈ స్పృహ గ‌వ‌ర్న‌ర్(Koshyari) కు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని అన్నారు.

ప్ర‌భుత్వ ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యే ఏ ప్రాంతంలోనూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌వేశించ కూడ‌ద‌ని సీజేఐ స్ప‌ష్టం చేశారు. శివ‌సేన పార్టీ గుర్తును ఈసీ షిండే పార్టీకి కేటాయించడాన్ని ప్ర‌స్తావించింది ధ‌ర్మాస‌నం.

Also Read : మోదీ అదానీపై ప్రేమ ఎందుకు

Leave A Reply

Your Email Id will not be published!