IIT Hyderabad Jobs : ఐఐటీ హైద‌రాబాద్ లో జాబ్స్

భారీ వేత‌నం ప‌ర్మినెంట్ జాబ్

IIT Hyderabad Jobs : ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న నిరుద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఐఐటీ హైద్రాబాద్(IIT Hyderabad Jobs). భారీ వేతనంతో పాటు ప‌ర్మినెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అనుభవం క‌లిగిన వారు ఎవ‌రైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇక జాబ్స్ ప‌రంగా చూస్తే టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ , టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్ , ఫిజిక‌ల్ ట్రైనింగ్ ఇన్ స్ట్ర‌క్చ‌ర్ , జూనియ‌ర్ టెక్నిషియ‌న్ పోస్టుల కోసం అప్లికేష‌న్ల‌ను ఆహ్వానిస్తోంది ఐఐటీ హైద‌రాబాద్.

ఆయా ఉద్యోగాల‌కు అప్లై చేసుకునే అభ్య‌ర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాల‌యం ఇన్ స్టిట్యూట్ నుంచి ప్ర‌త్యేక‌త క‌లిగిన కోర్సు క‌లిగిన బీఈ, బీటెక్ , బీపీఈడీ, ఎంఈ, ఎంటెక్ , ఎంఎస్, ఎంసీఏ , ఎంఎస్సీ, డిప్లొమా లేదా త‌త్స‌మాన కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. క‌నీసం 55 శాతం మార్కులు వ‌చ్చి ఉండాలి. అంతే కాకుండా సంబంధిత ప‌నికి సంబంధించి అనుభవం కూడా ఉండాలి. ఆయా పోస్టుల‌కు సంబంధించి వ‌య‌స్సు 35, 40, 45 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వెసులుబాటు క‌ల్పించింది ఐఐటీ హైద‌రాబాద్.

ఆయా పోస్టుల‌ను బ‌ట్టి కొంద‌రికి 35, మ‌రికొంద‌రికి 40 , ఇంకొన్ని పోస్టుల‌కు 45 ఏళ్ల గ‌రిష్ట వ‌య‌స్సు నిర్ణ‌యించింది సంస్థ‌. ఇక అర్హ‌త‌, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు ఎవ‌రైనా స‌రే ఆన్ లైన్ లో ఏప్రిల్ 3 తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద‌ని సంస్థ పేర్కొంది. ఇక ద‌ర‌ఖాస్తు చేసే వారు జ‌న‌ర‌ల్ (సాధార‌ణ‌) అభ్య‌ర్థులు రూ. 500 ఫీజు చెల్లించాల‌ని తెలిపింది ఐఐటీ హైద‌రాబాద్(IIT Hyderabad Jobs).

ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , ఈడ‌బ్ల్యూఎస్ , మ‌హిళా అభ్య‌ర్థులు ఆయా పోస్టుల‌కు సంబంధించి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ట్రేడ్ , స్కిల్ , రాత ప‌రీక్ష‌, ప్రొఫీషియ‌న్సీ టెస్ట్ ల ఆధారంగా క‌న‌బ‌ర్చిన ప్ర‌తిభ‌ను బ‌ట్టి ఎంపిక చేస్తారు.

Also Read : న‌ల్సార్ లో కొలువుల మేళం

Leave A Reply

Your Email Id will not be published!