IND vs AUS 2nd ODI : బీసీసీఐ నిర్వాకం భారత్ పరాజయం
10 వికెట్ల తేడా ఆసిస్ విక్టరీ
INDvsAUS 2nd ODI : వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నా జట్టులో ఎంపిక చేస్తూ వస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వాకం కారణంగా విశాఖ పట్టణం వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో చిత్తుగా ఓడి పోయింది(INDvsAUS 2nd ODI).
ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 రన్స్ కే పరిమితమైంది. 118 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
విరాట్ కోహ్లీ 31 రన్స్ చేస్తే అక్షర్ పటేల్ 29 పరుగులు మాత్రమే చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు భారత జట్టు తరపున. రోహిత్ శర్మ , శుభ్ మన్ గిల్ , ఇషాన్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా పెవిలియన్ బాట పట్టారు.
కనీసం వర్షం వచ్చినా బాగుండేదని ఫ్యాన్స్ ఆలోచించారంటే అర్థం చేసుకోవచ్చు మనోళ్ల ఆట తీరు. వరుసగా ఇషాన్, సూర్య ఫెయిల్ అవుతూ వస్తున్నా కంటిన్యూగా ఎంపిక చేస్తూ వస్తోంది బీసీసీఐ. మరో వైపు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నా కావాలని పక్కన పెట్టారు.
ఇకనైనా బీసీసీఐ తన తీరును మార్చుకోవాలి. కనీసం ఆఖరి వన్డే మ్యాచ్ కైనా ఎంపిక చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రత్యర్థి జట్టు ఇంకా 39 ఓవర్లు మిగిలి ఉండగానే విజయ కేతనం ఎగుర వేసింది ఆస్ట్రేలియా. ఆసిస్ బౌలర్ల దెబ్బకు పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు(IND vs AUS) నానా తంటాలు పడ్డారు.
గిల్ , సూర్య కుమార్ యాదవ్ , అక్షర్ పటేల్ , సిరాజ్ డకౌట్ అయ్యారు. ఇక రోహిత్ 13, రాహుల్ 9 , పాండ్యా 1, జడేజా 16 రన్స్ కే పరిమితమయ్యారు. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీశాడు. భారత టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు. ఆసిస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ 66 రన్స్ చేస్తే , ట్రావిస్ హెడ్ 51 రన్స్ తో నాటౌట్ గా మిగిలారు.
Also Read : ఆసిస్ దెబ్బకు భారత్ విలవిల