Sanju Samson : సంజూ శాంసన్ చేసిన తప్పేంటి
ఆడకున్నా ఆడిస్తూనే ఉంటారా
Sanju Samson IND vs AUS : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుసరిస్తున్న నిర్వాకం కారణంగా ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు తీరని అన్యాయం జరుగుతోంది. స్వదేశంలో జరుగుతున్న మూడు వన్డేల సీరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ గెలిస్తే రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా వైఫల్యం చెందుతున్నా బీసీసీఐ కావాలని వారికి వంత పాడుతోంది. ఇందుకు సూర్య కుమార్ యాదవ్ మినహాయింపు కాదు. ఇషాన్ కిషన్ , గిల్ , సూర్య వరుసగా నిరాశ పరిచారు.
విశాఖ మ్యాచ్ లో ఒక్క విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ తప్ప మిగతా వాళ్లంతా పెవిలియన్ బాట పట్టారు. గతంలో మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళ స్టార్ సంజూ శాంసన్ ను(Sanju Samson IND vs AUS) దృష్టిలో పెట్టుకుని కీలక కామెంట్స్ చేశారు. కనీసం ఒక ఆటగాడిని ఒకటి లేదా రెండు మ్యాచ్ లకు ఎంపిక చేయకుండా కంటిన్యూగా కనీసం 10 మ్యాచ్ లు ఆడించాలని ఆ తర్వాత ఉంచాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత జీ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా బుక్కై తన సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న చేతన్ శర్మ సంచలన ఆరోపణలు చేశాడు. సంజూ శాంసన్ పై తనకు , ఈసీసీఐకి ఉన్న కక్షను , వివక్షను బహిరంగంగానే బయట పెట్టాడు. ఒక రకంగా ముంబైకి చెందిన కొందరు ప్లేయర్లు కంటిన్యూగా ఎంపికవుతూ ఉండడం, ఇతరులను పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
Also Read : బీసీసీఐ నిర్వాకం భారత్ పరాజయం