Surya Kumar Sanju Samson : సూర్య కంటే సంజూ బెటర్
పూర్ పర్ ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ఫైర్
Surya Kumar vs Sanju Samson : త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.
గాయం కారణంగా దూరమైన సంజూ శాంసన్ ప్రస్తుతం బెంగళూరు లోని క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక వరుసగా ఫెయిల్ అవుతున్నా కంటిన్యూగా ప్లేయర్లను ఎంపిక చేస్తూ వస్తోంది బీసీసీఐ. దీనిపై తీవ్రంగా మండి పడుతున్నారు అభిమానులు. రాజకీయాలు ఎక్కువయ్యాయని ,
ఫేవరిటిజం కారణంగా చాలా మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందంటూ మాజీ భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆరోపించాదు. ఇదే సమయంలో ఒక ఆటగాడికి కనీసం 10 మ్యాచ్ లలో ఆడేందుకు ఛాన్స్ ఇవ్వాలన్నాడు. ఇక వరుసగా ఫెయిల్ అయినా , పరుగులేమీ చేయక పోయినా సూర్య కుమార్ యాదవ్ ను కంటిన్యూ చేస్తుండడంపై కేరళ స్టార్ సంజూ శాంసన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే సీరీస్ లో ఇప్పటి వరకు ఆడిన రెండు వన్డేలలో సూర్య భాయ్ చేసిన స్కోర్ సున్నా. వన్డే ఫార్మాట్ కు చక్కగా సరిపోయే ఆటగాడు శాంసన్(Surya Kumar vs Sanju Samson) అని కానీ ఎందుకు పక్కన పెట్టారంటూ నిప్పులు చెరుగుతున్నారు.
ఇలాగే ఆడుతూ పోతే భారత జట్టు కనీసం లీగ్ లోనే నిష్క్రమించే ఛాన్స్ ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. స్ట్రైక్ రేటు బాగానే ఉన్నా ఎందుకని సంజూను ఎంపిక చేయడం లేదని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇక సూర్య 20 ఇన్నింగ్స్ లు ఆడితే అతడి స్ట్రైక్ రేట్ 25 కావడం విశేషం.
Also Read : ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళుతుందా