Google Layoffs Comment : టెక్ దిగ్గజం ఆందోళనకరం
సుందర్ పిచాయ్ భరోసా ఇవ్వలేక పోతున్నాడా
Google Layoffs Comment : టెక్నాలజీలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఏటా దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం పేరుతో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం మామూలే. కానీ ఈ ఏడాది పెద్ద ఎత్తున లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి.
ఒక్క ఐటీ రంగానికే కాకుండా ఇతర రంగాలకు కూడా ఈ జాడ్యం పాకింది. సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతూ వస్తున్న సెర్చ్ దిగ్గజ కంపెనీ గూగుల్ లో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఫేస్ బుక్ మెటా, మైక్రో సాఫ్ట్ , ట్విట్టర్ తో పాటు గూగుల్ కూడా కొలువులకు కోత పెట్టింది(Google Layoffs Comment).
ప్రవాస భారతీయుడు, తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ప్రస్తుతం సిఇఓగా ఉన్నారు. ఆయన పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. అయినా ఎక్కడా ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల కారణంగా గూగుల్ కొంత రహస్యంగా ఉంటోంది.
ఇది ప్రతి కంపెనీకి సంబంధించి చేసేదే. ఇది పక్కన పెడితే ఇటీవల టెక్నాలజీని అల్లకల్లోలం చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ , చాట్ జిపిటి. దీని దెబ్బకు గూగుల్ షేర్లు కూడా పడి పోయాయి. కానీ ఆ తర్వాత నిలదొక్కుకున్నాయి. జూనియర్ల నుంచి సీనియర్ల దాకా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సుందర్ పిచాయ్(Sunder Pichai).
ఇదే సమయంలో ఎవరైనా సరే నిలదొక్కు కోవాలంటే అప్ డేట్ కావాలని స్పష్టం చేశారు తన అంతర్గత సమావేశంలో. ఇదిలా ఉండగా ఒక్కసారిగా పలువురిని పీకేశారు. వీరంతా బహిరంగ లేఖలు రాశారు గూగుల్ సిఇఓకు.
ఎవరో ఇచ్చిన సమాచారం ఆధారంగా తమను తీసి వేస్తే , బజారున పడేస్తే ఎలా అని కనీసం సాధ్యా సాధ్యాలు, వాస్తవాలు, ప్రతిభను ఆధారంగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ మేరకు సుదీర్ఘ లేఖ రాశారు వారంతా. ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 1,400 మంది జాబ్స్ నుంచి తొలగించిన వారంతా సంతకాలు చేశారు.
నేరుగా సుందర్ పిచాయ్ కు పంపారు. తమకు కొలువులు పోయాయన్న బాధ ఏమీ లేదని కానీ తీసి వేసే ముందు ఎవరు ఏమిటి అనే దానిపై ఆలోచించాలని కోరారు. లేఆఫ్స్ పరిస్థితిని కొంచెం మెరుగ్గా చేయాలని విన్నవించారు. తాజాగా లే ఆఫ్స్ కు(Google Layoffs) గురైన వారంతా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మందిని తొలగించాలని ముందే నిర్ణయించింది. ఆనాటి నుంచి నేటి దాకా ఎవరు ఉంటారు ఇంకెవరు ఉండరోనన్న ఆందోళన నెలకొంది.
సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) గా ఉన్న సుందర్ పిచాయ్ దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. గూగుల్ లో పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తారు ప్రపంచ వ్యాప్తంగా టెక్కీలు, ఇతర నిపుణులు.
అయితే ఉన్నట్టుండి పని చేస్తున్న వారి సిస్టమ్ లను లాక్ చేయడం, మరికొందరు సెలవులు, ప్రసూతి సెలవులు, వైద్య సెలవులపై వెళ్లిన వారిని నిర్దాక్షిణ్యంగా తీసి వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఉద్యోగులు. ఒక రకంగా సుందర్ పిచయ్ పనితీరుకు..గూగుల్ సంస్థకు ఇది ప్రమాదకరమైన సంకేతం అని చెప్పక తప్పదు.
Also Read : ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళుతుందా