Omar Abdullah Rahul : రాహుల్ కు ఒమర్ అబ్దుల్లా మద్దతు
లైంగిక వేధింపులకు గురైంది వాస్తవమే
Omar Abdullah Rahul : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆయనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహిళలు నేటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని, ఆ మహిళలు ఎవరో తమకు వివరాలు ఇవ్వాలని కోరుతూ పోలీసులు రాహుల్(Rahul Gandhi) ను కోరారు. 10 రోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ఆ వెంటనే రాహుల్ గాంధీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం కోసం మూడు రోజుల పర్యటనకు బయలు దేరి వెళ్లారు.
ప్రస్తుతం ఆయన కర్ణాటకలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా కేంద్రం ఒత్తిడి మేరకే ఎప్పుడో అన్న మాటలను తీసుకుని కావాలని కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనిపై స్పందించారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah Rahul). రాహుల్ గాంధీ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారనే వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన అన్నదాంట్లో తప్పు లేదని వాస్తవం ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర సర్కార్ ఏదో రకంగా విపక్షాలను టార్గెట్ చేస్తూ వస్తోందని ఆరోపించారు ఒమర్ అబ్దుల్లా. ఎన్నికల సందర్బంగా ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నోటీసులు పోలీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చవకబారు పనులు చేయడం మానుకోవాలని సూచించారు కాశ్మీరీ నాయకుడు. భారత దేశంలో లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయనేది వాస్తవం కాదా , ఆ విషయం రాహుల్ గాంధీ చెప్పాల్సిన అవసరం ఉన్నదా అని నిలదీశారు.
Also Read : కేంద్రం అధికార దుర్వినియోగం