Nikhat Zareen : రెండో సారి విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్‌ జరీన్

Nikhat Zareen WWB : భారత విమెన్ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తన పంచ్‌ పవర్‌తో మరోసారి బంగారు పతకాన్ని సాధించింది. ప్రపంచ విమెన్స్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో వియత్నాంకు చెందిన బాక్సర్‌ న్యూయెన్‌పై 5-0తేడాతో విజయం సాధించింది తెలంగాణ ముద్దుబిడ్డ

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి దేశ ప్రతిష్టను దశదిశలా చాటింది నిఖత్ జరీన్. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. లైట్ వెయిట్ కేటగిరీ (48-50 కేజీలు) ఫైనల్లో ప్రత్యర్ధిపై తన పంచ్‌ల వర్షంతో వరుసగా రెండో ఏడాది ప్రపంచ చాంపియన్ గా అవతరించింది. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో భారత్‌కు బంగారు పతకాలు సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌, లవ్లీనా బర్గోహైన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్‌పై వరల్డ్ బాక్సింగ్‌ పోటీల్లో ఫైనల్‌లో పైచేయి సాధించిన నిఖత్ జరీన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. దేశానికి మరోసారి బంగారు పతకం తెచ్చి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని నిఖత్ జరీన్(Nikhat Zareen WWB) మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని కితాబిత్తారు కేసీఆర్.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ 2022లో తొలిసారి ప్రపంచ చాంపియన్ గా అవతరించి స్వర్ణ పతకం గెలుచుకుంది. 2023లో తన టైటిల్ ను నిలబెట్టుకుంది. వరుసగా రెండు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన తొలి భారత మహిళా బాక్సర్ గా నిఖత్ జరీన్(Nikhat Zareen) నిలిచింది.

Also Read : బెంగళూరుకు షాక్.. ఐపీఎల్‌కు రజత్ పాటిదార్ దూరం ?

Leave A Reply

Your Email Id will not be published!