BCCI Annual Contracts : జడేజాకి బంపరాఫర్.. కేఎల్ రాహుల్ కి షాక్

BCCI Annual Contracts : బీసీసీఐ అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మొత్తం 26 మంది ఆటగాళ్లను చేర్చింది బీసీసీఐ.

బీసీసీఐ ఆటగాళ్లను A+, A , B మరియు C 4 గ్రేడ్‌ల కింద ఉంచింది. A+ గ్రేడ్‌లో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా ఏ+ గ్రేడ్‌లో ఉన్నారు. 

ఇప్పుడు జడేజాకి భారీ ప్రమోషన్ దక్కింది. జడేజాకి A+ గ్రేడ్‌లో చోటు కల్పించింది బీసీసీఐ. ఈ జాబితాలో చేరిన ఆటగాళ్లకు బీసీసీఐ వార్షిక రిటైనర్‌షిప్ ఫీజుగా రూ.7 కోట్లు చెల్లిస్తుంది. దీంతో ఐపీఎల్ కి ముందు జడేజా జాక్ పాట్ కొట్టేశాడు.

మరోవైపు.. కొంతకాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న భారత స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ గ్రేడ్స్‌లోనూ పడిపోయాడు. తాజాగా ప్రకటించిన వార్షిక జాబితాలో అతడు A నుంచి B కి వచ్చాడు.

అశ్విన్‌, రిషబ్‌ పంత్‌, షమి A గ్రేడ్ లోనే కొనసాగుతున్నారు. హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ కొత్తగా ప్రమోషన్ దక్కించుకున్నారు. తమ ఆల్ రౌండ్ ఎబిలిటీకి బంపరాఫర్ కొట్టేశారు. A కేటగిరిలోకి వచ్చారు.

ఇంతకుముందు హార్దిక్‌ సిలో, అక్షర్‌ బిలో ఉన్నారు. రాహుల్‌తో పాటు పుజారా, శ్రేయస్‌, సిరాజ్‌, సూర్యకుమార్‌, శుభ్‌మన్‌ గిల్‌ బిలో ఉన్నారు. ఉమేశ్‌, 

శిఖర్‌, శార్దూల్‌, ఇషాన్‌, హుడా, చాహల్‌, కుల్‌దీప్‌, సుందర్‌, శాంసన్‌, అర్ష్‌దీప్‌, భరత్‌ సిలో ఉన్నారు.

 A-గ్రేడ్‌లో చేర్చబడిన ఆటగాళ్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏటా రూ.5 కోట్లు ఇస్తుంది. బి గ్రేడ్‌లో చేర్చబడిన ఆటగాళ్లకు రూ. 3 కోట్లు మరియు సి గ్రేడ్‌లో చేర్చబడిన ఆటగాళ్లకు వార్షిక రిటైనర్‌షిప్ ఫీజుగా రూ. 1 కోటి లభిస్తుంది.

ఇక, సీనియర్ ఆటగాళ్లు రహానె, ఇషాంత్‌, భువనేశ్వర్‌ కుమార్, విహారి, సాహా, మయాంక్‌, దీపక్‌ చాహర్‌ కి భారీ షాక్ తగిలింది. వీరందరూ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో(BCCI Annual Contracts) చోటు కోల్పోయారు.

బీసీసీఐ A+ గ్రేడ్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

బీసీసీఐ A గ్రేడ్ : హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్

బీసీసీఐ B గ్రేడ్ : ఛతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, మహ్మద్ సిరాజ్‌, సూర్యకుమార్‌ యాదవ్, శుభ్‌మన్‌ గిల్‌

Also Read : రెండో సారి విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్‌ జరీన్

Leave A Reply

Your Email Id will not be published!