MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

MLC Kavitha ED : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా విచారణకు హాజరుకావడం లేదా ప్రతినిధిని పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

దీంతో ప్రతినిధిగా తన లీగల్ అడ్వైజర్ సోమ భరత్‌ను కవిత ఈడీ ఆఫీసుకు పంపారు. కవిత తరపున ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లి హాజరయ్యారు. ఇప్పటివరకు కవిత(MLC Kavitha) మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడం బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠకరంగా మారింది.

ఈ నెల 11,20,21 తేదీల్లో కవిత ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

లిఖితపూర్వక వాదనలు వినిపించాలని కవిత, ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితకు ఏ క్షణమైనా నోటీసులు ఇచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఈ మేరకు కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఓ లేఖ రాశారు. 

కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో పేర్కొన్నారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాలని తెలిపారు. ఈ ఫోన్లను ఓపెన్ చేసేందుకు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు (MLC Kavitha ED) తెలుస్తోంది. త్వరలో మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసి నేరుగా విచారణకు రావాలని కోరే అవకాశముందని తెలుస్తోంది.

Also Read : ఆర్టీసి ప్రయాణికులకు బిగ్ షాక్.. రద్దీని బట్టి టికెట్ ధర..!

Leave A Reply

Your Email Id will not be published!