CSK vs GT IPL 2023 : నేడే ఐపీఎల్.. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ పోరు
CSK vs GT IPL 2023 : ఇవాళ నుండి ఎంతో ఆత్రుత తో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ రానే వచ్చేసింది. ఈ మేరకు 16వ సీజన్ ప్రారంభమవుతుంది. మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తం 58 రోజుల్లో 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో 18 రోజుల్లో.. రోజుకు రెండేసి మ్యాచ్‌లు ఉన్నాయి. మొత్తం 12 స్టేడియంలలో మ్యాచ్‌లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్.. మే 28న జరుగుతుది.
తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్(CSK vs GT IPL 2023) మధ్య జరగనుంది. ఈ మ్యా్చ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే పెద్ద స్టేడియం. ఇక్కడ తొలి మ్యాచ్ జరగడం అభిమానులకు ఫన్డగే. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రసారం అవుతాయి.
తొలి మ్యాచ్‌లో చూస్తే 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టి.. టైటిల్ ఎగరేసుకుపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచేలా కనిపిస్తోంది. ఆ జట్టు అన్ని రకాలుగా పవర్‌ఫుల్‌గా ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, కేఎస్ భరత్, రషీద్ ఖాన్, మహమ్మద్ షమి ఆ జట్టుకి బలంగా ఉన్నారు.
ఇప్పటికే 4 సార్లు టైటిల్ నెగ్గిన చెన్నై.. ఈసారి కూడా కప్ గెలవాలనుకుంటోంది. ఆ జట్టులో మహేంద్ర సిగ్ ధోనీ ఎడమ కాలికి గాయం కావడంతో.. కొంత ఆందోళనలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ధోనీ ఉండకపోవచ్చు అంటున్నారు. అదే జరిగితే.. ఐపీఎల్లో(IPL 2023) మాత్రమే ఆడుతున్న ధోనీ లేని ఈ మ్యాచ్.. CSK అభిమానులకు కొంత నిరాశ కలిగించవచ్చు. ధోని లేకపోయినా.. ఆల్‌రౌండర్ స్టోక్స్, డెవాన్ కాన్వె, అంబటి రాయుడు, రుతురాజ్, జడేజా, దీపక్ చాహర్ మొయిన్ అలీ, తీక్షణలతో చెన్నై టీమ్ కూడా పవర్ఫుల్ గానే ఉంది.
ఈసారి ప్రారంభ వేడుకల్లో.. నేషనల్ క్రష్ రష్మిక మంధాన, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డాన్స్ షోలు ఉన్నాయి. స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ సాంగ్స్తోపాటూ.. మరికొన్ని కార్యక్రమాలు.. సాయంత్రం 6 గంటలకు మొదలవుతాయి.
ఈసారి సీజన్లో సన్ రైజర్స్ జట్టు కూడా బలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌కి సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ ఉంటాడు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌తో SRH మ్యాచ్ ఉంది.
Also Read : చెన్నై కి హ్యాండిచ్చిన బౌలర్.. ఇక కష్టమే!