Tilak Varma MI vs RCB : చిన్న స్వామి స్టేడియం లో తెలుగోడి సత్తా .. 46 బంతుల్లోనే 84 రన్స్ ..
Tilak Varma MI vs RCB : 9 ఓవర్లలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన తిలక్ ఆరంభంలో వికెట్‌ను కాపాడుకుంటూ నిలకడగా ఆడాడు. నేహల్ వదేరా (13 బంతుల్లో 21) కలిసి ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. ఆతర్వాత వదేరా ఔటైనా తిలక్ దూకుడు కొనసాగించాడు. సహచరులు ఒక్కొక్కరు వెనదిరుగుతున్నా..
తెలుగబ్బాయి తిలక్ వర్మ(Tilak Varma MI vs RCB) మరోసారి అదరగొట్టాడు. గతేడాది ఫామ్‌ను కొనసాగిస్తూ ఐపీఎల్ 16 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెలరేగాడీ ముంబై బ్యాటర్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే 84 పరుగుల చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ సునామీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 9 ఓవర్లలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన తిలక్ ఆరంభంలో వికెట్‌ను కాపాడుకుంటూ నిలకడగా ఆడాడు. నేహల్ వదేరా (13 బంతుల్లో 21) కలిసి ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. ఆతర్వాత వదేరా ఔటైనా తిలక్ దూకుడు కొనసాగించాడు. సహచరులు ఒక్కొక్కరు వెనదిరుగుతున్నా ఒంటరి పోరాటం కొనసాగించాడు.
ఇక చివరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్‌లను లక్ష్యంగా చేసుకుని బౌండరీల వర్షం కురిపించాడు. 17.1 ఓవర్లలో 7 వికెట్ కోల్పోయినప్పుడు ముంబై స్కోరు 123 పరుగులే. ఈ పరిస్థితలో జట్టు స్కోరు 150 పరుగులు దాటడం కష్టమేననిపించింది. అయితే అర్షద్ ఖాన్ ( 9 బంతుల్లో 15) సహాయంతో జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు తిలక్(Tilak Varma).
దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు శుభారంభం దక్కలేదు. రోహిత్ (1), ఇషాన్ (10), కామెరున్ (5), సూర్య (15) వరుసగా విఫలమయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్(4) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.
Also Read : ముంబై ని మట్టికరిపించిన ధీరుడు కింగ్ కోహ్లీ