Brian Lara SRH : లారా ఉన్నా రాత మారని హైదరాబాద్
వరుస పరాజయాలతో పరేషాన్
Brian Lara SRH : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తమిళనాడు మీడియా మొఘల్ గా పేరొందిన మారన్ ఎస్ ఆర్ హెచ్ ను తీసుకున్నా దాని తల రాత మారడం లేదు. ఇప్పటికే పలు ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కెప్టెన్లను మార్చింది. భారీ ధరకు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. చివరకు హెడ్ కోచ్, కోచ్ , మెంటార్ లను కూడా మార్చేసింది. అయినా సేమ్ సీన్. అదే నిర్లిప్తత. అదే ఆట తీరు. ఎక్కడా హైదరాబాద్ జట్టులో పోరాట పటిమ అన్నది కనిపించడం లేదు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యంకు సిఇఓగా ఉన్న కావ్య మారన్ ప్రస్తుతం డైలమాలో పడి పోయింది. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఫలితం కనిపించడం లేదు. ఇతర జట్లకు తీసిపోని విధంగా క్రికెటర్లను తీసుకున్నా ప్రతిభ కనబర్చడంలో , సమిష్టిగా రాణించడంలో విఫలం అవుతూ వస్తున్నారు. వేల కోట్ల రూపాయల సంస్థలను సమర్థవంతంగా నడిపిన కావ్య మారన్ కు హైదరాబాద్ జట్టు ఆట తీరు అంతు చిక్కని పజిల్ గా మారింది.
విండీస్ క్రికెటర్ దిగ్గజం బ్రియన్ లారా(Brian Lara SRH) హెడ్ కోచ్ గా నియమించినా హైదరాబాద్ ఆట తీరు ఎప్పటి లాగే ఉంది. మరో వైపు ఇతర జట్లు అద్భుత విజయాలను నమోదు చేస్తున్నాయి. గత సీజన్ లో పేలవమైన ఆట తీరును ప్రదర్శించిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ , లక్నో రెండు మ్యాచ్ లలో గెలుపొందాయి. సత్తా చాటాయి.
Also Read : హైదరాబాద్ పరాజయం పరిసమాప్తం