Rahul Tripathi : రఫ్పాడించిన రాహుల్ త్రిపాఠి
మారథాన్ ఇన్నింగ్స్ తో ఫైర్
Rahul Tripathi : ఐపీఎల్ 16వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే పరిమితమైంది. స్కిప్పర్ శిఖర్ ధావన్ వన్ మ్యాన్ షో చేశాడు.
సహచరులు పెవిలియన్ దారి పడుతున్నా ఎక్కడా తగ్గలేదు. ఏకంగా 99 రన్స్ చేసి చివరి దాకా ఉన్నాడు. ఇందులో 12 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి.
అనంతరం 144 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన హైదరాబాద్ కు ఆదిలోనే దెబ్బ తగిలింది. బ్రూక్ ను అర్ష్ దీప్ అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) ఎక్కడా తగ్గలేదు. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. 74 పరుగులు చేశాడు.
కెప్టెన్ మార్క్రమ్ 37 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ కొట్టింది. మూడు మ్యాచ్ ల కు గాను రెండింట్లో ఓటమి పాలైంది. ఇక త్రిపాఠి 48 బంతులు ఎదుర్కొని సిక్స్ లు, ఫోర్లతో రెచ్చి పోయాడు. మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. మార్కండేయ తక్కువ పరుగులు ఇచ్చి వికెట్లు కూల్చాడు.
Also Read : హైదరాబాద్ గెలిచింది ‘పాప’ నవ్వింది