Suhana Khan Rinku Singh : ఐపీఎల్ 16వ సీజన్ లో అద్బుతం చోటు చేసుకుంది. యూపీకి చెందిన యువ క్రికెటర్ రింకూ సింగ్ అసాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. 205 పరుగుల భారీ స్కోర్ లక్ష్యాన్ని చేరుకోడంలో ముఖ్య భూమికను పోషించాడు. కేవలం 21 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ 48 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
గెలిచేందుకు ఆఖరి ఓవర్ లో 29 పరుగులు కావాల్సి ఉండగా ఏకంగా 31 పరుగులు వచ్చాయి. ఇందులో చివరి ఓవర్ వేసిన యశ్ దయాల్ బౌలింగ్ లో వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు రింకూ సింగ్(Rinku Singh). ఒక రకంగా నిద్ర పోనీయకుండా చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు. తనకు ఎదురే లేదని చాటాడు. ఈ సందర్బంగా సోషల్ మీడియా ఇప్పుడు రింకూ సింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వారిలో అన్ని వర్గాలకు చెందిన వారున్నారు.
నటీ నటులు అయితే రింకూ సింగ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఒకే ఒక్క మ్యాచ్ విన్నింగ్ తో రింకూ సింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. నేషనల్ హీరోగా అతడిని కీర్తిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటులు సుహానా ఖాన్..(Suhana Khan Rinku Singh) అనన్య పాండే రింకూ సింగ్ ఆట తీరుకు ఫిదా అయ్యారు. అద్భుతంగా ఆడావంటూ కితాబు ఇచ్చారు. ప్రస్తుతం వీరు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : రఫ్పాడించిన రాహుల్ త్రిపాఠి