BCCI Action : ఐపీఎల్ 16వ సీజన్ లో బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సీరియస్ గా స్పందించారు. హెల్మెట్ – త్రో చేసినందుకు గాను అవేష్ ఖాన్ పై చర్య తీసుకుంది.
అంతే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ ఫాఫ్ డుప్లెసిస్ కి బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించింది బీసీసీఐ(BCCI Action).
మ్యాచ్ లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ కు చెందిన అవేష్ ఖాన్ ను మందలించారు. చివరి బంతి తర్వాత అవేష్ ఖాన్ దూకుడు ప్రతిస్పందనను గమనించినట్లు పేర్కొంది. అంతే కాకుండా లక్నో సూపర్ జెయింట్స్ కు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి 2.2 లెవల్ 1 జెయింట్స్ ఆటగాడు అవేష్ ఖాన్ ను మందలించడం జరిగిందని పేర్కొంది బీసీసీఐ. ఈ నియమావళి ప్రకారం మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమం అని తెలిపింది.
నాన్ స్ట్రైకర్స్ ఎండ్ కు చేరుకున్న వెంటనే అవేష్ ఖాన్ తన హెల్మెట్ తీసి నేల పైకి విసిరాడు. దీనిని సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది బీసీసీఐ. మరో వైపు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించింది.
Also Read : ఉత్కంఠ పోరులో జెయింట్స్ దే హవా