Raghav Chadha Parineeti : పరిణీతి చోప్రాపై చద్దా కామెంట్స్
త్వరలోనే అన్నీ తెలుస్తాయి
Raghav Chadha Parineeti : ఆమ్ ఆద్మీ పార్టీలో మోస్ట్ పాపులర్ లీడర్ గా ఉన్నారు రాజ్యసభ ఎంపీ , పంజాబ్ ప్రభుత్వ సలహాదారు రాఘవ్ చద్దా. ఆయన విద్యాధికుడు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నమ్మకస్తుడు. ఆయన టీంలో కీలకమైన వ్యక్తి. ఇది పక్కన పెడితే ఇవాళ ఆప్ కు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. పార్టీకి జాతీయ హోదా ఇస్తున్నట్లు. దీంతో మంగళవారం ఆ పార్టీలో సంబురాలు మిన్నంటాయి.
ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. పార్టీ కోసం కష్ట పడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సంబుర సమయంలో హాట్ టాపిక్ గా మారారు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha Parineeti). గత కొంత కాలం నుంచీ ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో ఆయన డేటింగ్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా హల్ చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో.
ఇవాళ ఇదే విషయంపై అడిగితే రాఘవ్ చద్దా నవ్వారు కానీ అవునని కాదని చెప్పలేక పోయారు. ఒక రకంగా తమ ప్రేమ విషయాన్ని ఇంకా సస్పెన్స్ లోనే పెట్టారు ఎంపీ.
త్వరలోనే ఏదో ఒకటి మీకు (మీడియా) చెప్పకుండా ఎలా ఉంటానంటూ ఎదురు ప్రశ్న వేశారు తెలివిగా రాఘవ్ చద్దా. ఈ ఆప్ ఎంపీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. ఎందుకంటే మనోడు తెలివైన రాజకీయ నాయకుడే కాదు అందమైన యువ నాయకుడు కూడా. పరిణీతి చోప్రా మాత్రం ఇంకా తన మనసులోని మాట బయట పెట్టక పోవడం విశేషం.
Also Read : మహనీయుడు జ్యోతిబా పూలే