Kanduru Jana Reddy : నిలకడగా కందూరు జానారెడ్డి ఆరోగ్యం
యశోద ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి
Kanduru Jana Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కందూరు జానారెడ్డి(Kanduru Jana Reddy) అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబీకులు జానా రెడ్డిని యశోద ఆస్పత్రికి తరలించారు .మోకాలి శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ఆయనకు ఉన్నట్టుండి అన్ని చెకప్ లు చేశారు. చివరగా గుండెకు సంబంధించి ఒక రక్తనాళం పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు.
దీంతో వెంటనే ఎంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. నిపుణులైన డాక్లర్ల పర్యవేక్షణలో వెంటనే కందూరు జానా రెడ్డికి స్టంట్ వేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి గట్టెక్కారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కందూరు జానా రెడ్డి(Kanduru Jana Reddy) హైదరాబాద్ లోని సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. తెలంగాణ రాజకీయాలలో అత్యంత పేరు మోసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఒక రకంగా ఆయనకు అన్ని పార్టీలతో సత్ సంబంధాలు ఉన్నాయి.
ఆయా పార్టీల నేతలతో స్నేహ పూర్వకంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా కందూరు జానా రెడ్డిని గౌరవిస్తారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందని కుటుంబీకులకు ఫోన్లు చేస్తున్నారు.
Also Read : ఉద్యోగినులకు ఏపీ సర్కార్ తీపి కబురు