Pakistan ODI World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాక్ ఆడే ఛాన్స్

కోల్ క‌తా, చెన్నైలైతే ఓకే

Pakistan ODI World Cup : ఈ ఏడాది రెండు కీల‌క‌మైన టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి. విచిత్రం ఏమిటంటే దాయాది దేశాలు భార‌త్, పాకిస్తాన్ లు నిర్వ‌హించాల్సి ఉంది. ఇప్ప‌టికే భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా తాము వెళ్లేది లేదంటూ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌క‌టించింది.

మ‌రో వైపు మీరు రాక పోతే మేము కూడా రాలేమంటూ పీసీబీ స్ప‌ష్టం చేసింది. పాకిస్తాన్(Pakistan ODI World Cup) ఈసారి 2023కి సంబంధించి ఆసియా క‌ప్ నిర్వ‌హించాల్సి ఉంది. మ‌రో వైపు ఐసీసీ ప‌రంగా వ‌ర‌ల్డ్ క‌ప్ ను భార‌త్ చేప‌ట్టాల్సి ఉంది. మీరు ఆసియా క‌ప్ లో పాల్గొన‌క పోతే మేం వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడేది లేదంటూ పేర్కొంది పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు.

దీనికి బీసీసీఐ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. పాకిస్తాన్ రాక పోయినా త‌మ‌కు ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని, ఆ జ‌ట్టుకే తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని గుర్తుంచు కోవాల‌ని స్ప‌ష్టం చేసింది. చివ‌ర‌కు పాకిస్తాన్ ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. ప్ర‌స్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ తో పాటు ఐసీసీలో బీసీసీఐ మాట‌కు విలువ ఎక్కువ‌. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన ఏకైక క్రీడా సంస్థ బీసీసీఐనే.

ఇక పోతే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడేందుకు పాకిస్తాన్ మొగ్గు చూపుతున్న‌ట్లు ఐసీసీ పేర్కొంది. ఈ మేర‌కు భార‌త్ లోని చెన్నై , కోల్ క‌తా వేదిక‌ల‌లో ఆడేందుకు ఓకే చెప్ప‌డం విశేషం. మ‌రో వైపు త‌ట‌స్థ వేదిక‌ల్లో భార‌త్ , పాకిస్తాన్ ఆడేందుకు ఓకే చెప్పాయి. మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్ కు పండ‌గేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : సూర్య నాలుగోసారి గోల్డెన్ డ‌క్

Leave A Reply

Your Email Id will not be published!