Rinku Singh SRH vs KKR : వారెవ్వా రింకూ సింగ్ అదుర్స్

మ‌రోసారి త‌ళుక్కుమ‌న్న క్రికెట‌ర్

Rinku Singh SRH vs KKR : ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 16వ సీజ‌న్ కీల‌క లీగ్ మ్యాచ్ లో హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్(Rinku Singh SRH vs KKR). నువ్వా నేనా అన్న రీతిలో చివ‌రి బంతి వ‌ర‌కు కొన‌సాగింది. మ‌రోసారి రింకూ సింగ్ ఆప‌ద్భాంద‌వుడిగా మారాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ కు చుక్క‌లు చూపించాడు యూపీ కుర్రాడు.

తాజాగా జ‌రిగిన మ్యాచ్ లోనూ మెరుపులు మెరిపించాడు. గెలుపు చివ‌రి అంచుల దాకా తీసుకు వ‌చ్చాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివ‌రి ఓవ‌ర్ మ‌లుపు తిప్పింది. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగి పోయింది. రింకూ సింగ్(Rinku Singh) క్రీజులో ఉన్నంత వ‌ర‌కు కేకేఆర్ ఫ్యాన్స్ త‌మ జ‌ట్టు విజ‌యం సాధిస్తుంద‌ని భావించారు. టాస్ గెలిచిన క‌ల‌క‌త్తా స్కిప్ప‌ర్ నితీష్ రాణా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

స‌న్ రైజ‌ర్స్ దుమ్ము రేపింది. ఇంగ్లండ్ క్రికెట‌ర్ హ్యారీ బ్రూక్ నిప్పులు చెరిగాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 12 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో మోత మోగించాడు. అత‌డికి అండ‌గా కెప్టెన్ ఏడెన్ మార్క్రామ్ 2 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 228 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.

అనంత‌రం బ‌రిలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చివ‌రి దాకా పోరాడింది. నితీష్ రాణా 75 ప‌రుగుల‌తో రాణిస్తే రింకూ సింగ్ ఆఖ‌రులో స‌త్తా చాటాడు. 58 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో 23 ప‌రుగుల తేడాతో హైద‌రాబాద్ చేతిలో ఓట‌మి పాలైంది.

Also Read : హైద‌రాబాద్ స్కిప్ప‌ర్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!