Faf Du Plessis : చితక్కొట్టిన ఫాఫ్ డుప్లెసిస్
చెన్నైకి చుక్కలు చూపించిన కెప్టెన్
Faf Du Plessis : బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 226 రన్స్ చేసింది. ఇదే ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ లో అత్యధిక స్కోర్. డేవిన్ కాన్వే దంచి కొడితే శివమ్ దూబే శివమెత్తాడు.
అనంతరం 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. వస్తూనే ఫోర్ కొట్టిన కోహ్లీ ఉన్నట్టుండి సిక్స్ కొట్టబోయి బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ గా వెనుదిరిగాడు. తుషార్ దేష్ పాండే బౌలింగ్ లో . అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis), గ్లెన్ మ్యాక్స్ వెల్ లు చితక్కొట్టారు. ఎక్కడా చెన్నైకి వెసులుబాటు ఇవ్వలేదు.
వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒకానొక దశలో గెలుపు అంచుల్లోకి తీసుకు వచ్చారు వీరిద్దరూ. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నారు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. ఫాఫ్ డుప్లెసిస్ 33 బంతులు ఎదుర్కొని 62 రన్స్ చేశాడు.
ఇందులో 5 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 187.87 గా ఉంది. ఫుల్ ఫామ్ మీద ఉన్న డుప్లెసిస్ ను(Faf Du Plessis) మొయిన్ అలీ బోల్తా కొట్టించాడు. కెప్టెన్ ధోనీ వండర్ ఫుల్ క్యాచ్ పట్టాడు. కానీ జట్టును గెలిపించ లేక పోయాడు. ఇక్కడే మ్యాచ్ టర్నవుట్ అయ్యింది. చివరలో దినేష్ కార్తీక్ వచ్చినా 8 రన్స్ తో ఓటమి పాలైంది.
Also Read : అబ్బా డెవాన్ కాన్వే దెబ్బ