Air India Hike : జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా
పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి పెంపు
Air India Hike : ఎయిర్ ఇండియా తీపి కబురు చెప్పింది తమ సిబ్బందికి. పైలట్లు, క్యాబిన్ క్రూ జీతాలు(Air India Hike) పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కీలక విషయాన్ని వెల్లడించింది. ట్రైనీ పైలట్ రూ. 50,000గా ఉంది. ఇక సీనియర్ కమాండర్ నెలకు రూ. 8.50 లక్షలు సంపాదిస్తారు. ఎయిర్ ఇండియా కూడా పైల్ల గంటకు ఫ్లయింగ్ అలవెన్స్ రేట్లను పెంచింది.
కొత్త నిర్మాణం ప్రకారం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ లైన్స్ ఐదు సంవత్సరాల ప్లాన్ లో భాగంగా ఎయిర్ ఇండియా , ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తో సహా) అంతటాత 2,700 కంటే ఎక్కువ మంది పైలట్లకు వేతనాలు పెంచనున్నారు. వీరితో పాటు ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిలో 5,600 మంది ఉన్నారు. వీరికి కూడా ఎయిర్ ఇండియా సంస్థ పెంచనుంది.
ఏప్రిల్ 1, 2023 నుండి విమానయాన సిబ్బంది పరిహారంలో సవరణను ప్రకటించినందుకు తాము సంతోషిస్తున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా సంస్థ. ఇదిలా ఉండగా క్యాబిన్ సిబ్బందికి నెలకు రూ. 25,000 జీతం ఇస్తారు. క్యాబిన్ ఎగ్జిక్యూటివ్ కు నెలకు రూ. 78,000 లభించనుంది. ఎయిర్ ఇండియా పైలట్ ల ప్రతి గంట ప్లయింగ్ అలవెన్స్ రేట్లను పెంచింది. ఇక పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల వరకు పెంచింది ఎయిర్ ఇండియా(Air India).
Also Read : ముంబైలో యాపిల్ స్టోర్ ప్రారంభం