OTTS Comment : ఓటీటీలదే రాజ్యం చర్యలు శూన్యం
ఇకనైనా కేంద్రం కళ్లెం వేసేనా
OTTS Comment : ప్రపంచాన్ని ఓటీటీలు శాసిస్తున్నాయి. లెక్కకు మించిన సీరియల్స్, వెబ్ సీరీస్, సినిమాలకు లెక్క లేకుండా పోయాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న సదరు ఓటీటీ ప్లాట్ ఫారమ్ వేదికగా చేసుకున్న సంస్థలు రాజ్యం ఏలుతున్నాయి.
ఒకప్పుడు థియేటర్లకు వెళ్లే వాళ్లు. ఇప్పుడు మొబైల్స్ లోనే అన్నీ చూసే సదుపాయం కలుగుతోంది. దీంతో మొబైల్ కీలకంగా మారింది. కుటుంబాలను, సమాజాన్ని, దేశాలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. అపరిమితమైన డేటా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కనెక్టివిటీ, అత్యాధునిక సాంకేతికత మనుషుల్ని, వ్యవస్థలను, సంస్థలను, కంపెనీలను మరింత దగ్గరకు చేస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ప్రత్యేకించి భారత దేశంలో ఓటీటీల(OTTS Comment) విప్లవం మొదలైంది. దేశీయంగా, విదేశాల నుంచి వచ్చే వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలకు, డాక్యుమెంటరీలకు కొన్ని నియమాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డు అనేది ప్రత్యేకంగా ఉంది. కానీ ఓటీటీలకు ఎలాంటి సెన్సార్షిప్ అన్నది లేకుండా పోయింది. ఇక్కడే అసలైన వ్యాపారం జోరుగా సాగుతోంది.
యూత్ ను టార్గెట్ చేసుకున్న కొన్ని సంస్థలు కావాలని బూతును చొప్పిస్తున్నాయి. ఇవాళ సెక్స్ అన్నది కామన్ పాయింట్ గా మారింది. ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలు లేకుండా పోతున్నాయి. వీటికి తోడు నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ , ఆహా, జియో, హాట్ స్టార్ ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్నాయి.
ఏదైనా కథకు అనుగుణంగా భావోద్వేగాలు, రొమాంటిక్ సన్నివేశాలు ఉండేవి. ఎబ్బెట్టుగా లేకుండా చూసేలా అనిపించేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇక వెబ్ సీరీస్, సీరియల్స్ లలో అశ్లీలత పెచ్చరిల్లి పోయింది. ఇదే ఇప్పుడు మార్కెట్ రంగాన్ని శాసిస్తోంది. కోట్ల వర్షం కురిపిస్తోంది.
దీంతో మొత్తం ప్రపంచాన్ని సెక్స్ ప్రభావితం చేస్తోంది. దాని చుట్టూ అల్లుకున్న వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
మరో వైపు పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఓటీటీలలో(OTTS Comment) చోటు చేసుకున్న అశ్లీలత గురించి. దీనిపై తీవ్రంగా చర్చ చేపట్టింది కేంద్రం. ఒక రకంగా ఇది మంచిదే. ఇక ఇంటర్నెట్ వేదికగా కోట్లాది వెబ్ సైట్స్, ట్రిలియన్ల కొద్దీ బూతు దుమ్ము రేపుతోంది.
ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల దాకా ఓటీటీలలో సేద దీరుతున్నారు. విలువైన కాలాన్ని కోల్పోతున్నారు. దేనికైనా పరిమితి అనేది ఉంటుంది. అది కూడా దాటి పోతే చివరకు సమాజంపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
Also Read : ఐటీ తగ్గేదే లే..సుకుమార్ కు షాక్