Kiran Deep Kaur : ఎవరీ కిరణ్ దీప్ కౌర్
ఎయిర్ పోర్ట్ లో నిలిపి వేత
Kiran Deep Kaur : ఖలిస్తాన్ తీవ్రవాద నాయకుడు, సిక్కు ప్రబోధకుడు అమృత పాల్ సింగ్ కు భార్యనే ఈ కిరణ్ దీప్ కౌర్(Kiran Deep Kaur). ఆమె బ్రిటీష్ కు చెందిన పౌరురాలు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమృతపాల్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. గత మార్చి 18న పోలీసుల కళ్లు గప్పి అమృత పాల్ సింగ్ పారి పోయాడు. పంజాబ్ పోలీసులతో పాటు ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం జల్లెడ పడుతోంది. మరో వైపు సర్కార్ ఏకంగా రూ. 5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.
ఇదిలా ఉండగా తాను ఎక్కడికీ పోలేదని ప్రపంచం ముందుకు త్వరలో వస్తానని చెప్పాడు. ఈ వీడియోను షేర్ చేశాడు. ఇది కలకలం రేపింది. తాజాగా పోలీసుల కళ్లు గప్పి అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు వెళుతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు కిరణ్ దీప్ కౌర్(Kiran Deep Kaur) ను నిలిపి వేశారు. వెంటనే సమాచారాన్ని పంజాబ్ పోలీసులకు అందజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను లండన్ కు వెళ్లనీయకుండా ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు.
ప్రస్తుతం అమృత పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థకు చీఫ్ గా ఉన్నాడు. కిరణ్ దీప్ కౌర్ అమృతపాల్ సింగ్ లు పంజాబ్ లో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది తన పెళ్లికి వారం రోజుల ముందు ఇండియాకి వచ్చింది. తాను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అమృత పాల్ తో టచ్ లో ఉన్నానని తెలిపింది. 1951లో తన తాత యుకెకు వెళ్లారని , తన కుటుంబంతా అక్కడే ఉందని తెలిపింది. అమృత్ సర్ లోని జల్లు పూర్ ఖేరా గ్రామంలో అమృతపాల్ సింగ్ తల్లితో పాటు కిరణ్ దీప్ కౌర్ ను విచారించారు.
Also Read : ద్వైపాక్షిక కోణంలో చూడకండి – భుట్టో