Ravindra Jadeja : తిప్పేసిన ర‌వీంద్ర జ‌డేజా

స‌త్తా చాటిన డేవిడ్ కాన్వే

Ravindra Jadeja : ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి స‌త్తా చాటాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. ఇప్ప‌టికే అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ఆల్ రౌండ‌ర్ గా రాణిస్తున్నాడు జడ్డూ. చెన్నై లోని చిదంబ‌రం మైదానంలో కీల‌క లీగ్ మ్యాచ్ జ‌రిగింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన సూప‌ర్ కింగ్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 134 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. చెన్నై బౌల‌ర్లు ఆద్యంత‌మూ స‌త్తా చాటారు. విచిత్రం ఏమిటంటే హైద‌రాబాద్ 10 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 72 ర‌న్స్ చేసి ప‌టిష్ట‌వంత‌మైన స్థితిలో ఉంది. కానీ ఆ త‌ర్వాత సీన్ మార్చేశారు చెన్నై బౌల‌ర్లు. త‌క్కువ స్కోర్ కే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క‌ట్ట‌డి చేసింది సీఎస్కే.

ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) 4 ఓవ‌ర్లు వేసి కీల‌క‌మైన 3 వికెట్లు తీశాడు. ర‌న్స్ చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అనంత‌రం క్రీజులోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 135 స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ కాన్వే దుమ్ము రేపాడు. 77 ర‌న్స్ చేసి మ‌రోసారి రాణించాడు. రుతురాజ్ గైక్వాడ్ సైతం స‌త్తా చాటాడు.

ఇక పాయింట్ల ప‌ట్టిక ప‌రంగా చూస్తే సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాప్ లో కొన‌సాగుతోంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించి 3వ స్థానంలోకి చేరుకుంది. 6 మ్యాచ్ లు ఆడింది. 4 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. 2 మ్యాచ్ లు ఓడి పోయింది.

Also Read : ఐపీఎల్ ప్లే ఆఫ్స్..ఫైన‌ల్ షెడ్యూల్

Leave A Reply

Your Email Id will not be published!