MS Dhoni IPL : నా కెరీర్ లో ఇదే చివరిది – ధోనీ
సీఎస్కే స్కిప్పర్ సంచలన ప్రకటన
MS Dhoni IPL : జార్ఖండ్ డైనమెట్ చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni IPL) సంచలన ప్రకటన చేశారు. చెన్నై లోని చిదంబరం వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది.
మ్యాచ్ గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడారు ఎంఎస్ ధోనీ. సంచలన ప్రకటన చేశాడు. తన కెరీర్ లో ఇదే చివరి ఐపీఎల్ టోర్నీ అని వెల్లడించాడు. ఎంత గొప్ప ఆటగాడైనా ఏదో ఒక రోజు నిష్క్రమణ చేయాల్సిందేనని పేర్కొన్నాడు. తన కెరీర్ లో ఇదే చివరి టోర్నీగా పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ లో డేవిడ్ కాన్వే , రవీంద్ర జడేజా సత్తా చాటడంతో సీఎస్కే సూపర్ విక్టరీ సాధించింది. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni IPL) చేసిన ప్రకటన కలకలం రేపింది. ప్రధానంగా సీఎస్కే యాజమాన్యం విస్మయానికి గురైంది. ధోనీ ఉన్నంత వరకు తమ జట్టుకు అతడే సారథి అని వేరే వాళ్లను నియమించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా గత ఐపీఎల్ సీజన్ లో ధోనీ అనూహ్యంగా తప్పుకున్నాడు. రవీంద్ర జడేజాకు అప్పగించినా ఫలితం లేక పోయింది. చివరకు జార్ఖండ్ డైనమెట్ కు మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించింది సీఎస్కే మేనేజ్ మెట్. అభిమానుల ఆదరాభిమానాలను తాను ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకున్నానని చెప్పాడు కూల్ కెప్టెన్.
Also Read : అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్