Karnataka Election 2023 : కర్ణాటక ఎన్నికల బరిలో 3,044
అందరి ఫోకస్ డీకే శివకుమార్ పైనే
Karnataka Election 2023 : కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వచ్చే నెల మే10న పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు పరిశీలన కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది.
నామినేషన్లు వేసిన వారిలో 3,044 మంది బరిలో ఉండనున్నారని సమాచారం. మరో వైపు ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారనే ఆరోపణలపై మొదట కర్ణాటక(Karnataka Election 2023) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ నామినేషన్ ను పక్కన పెట్టింది. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది.
చివరకు కేంద్ర ఎన్నికల సంఘం దిగి వచ్చింది. డీకే శివకుమార్ నామినేషన్ ఓకే చేసింది. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నామినేషన్ ను తిరస్కరించేందుకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 24 వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
బీజేపీ ఐటీ సెల్ తన అఫిడవిట్ ను పరిశీలిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు డీకే శివకుమార్. అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. నామినేషన్ వేసిన అభ్యర్థులలో 219 మంది బీజేపీ నుండి, 218 కాంగ్రెస్ నుండి, 207 మంది జేడీఎస్ నుండి ఉన్నారు.
మిగిలిన వారందరూ చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నట్లు సిఇఓ కార్యాలయం వెల్లడించింది. ఈ అభ్యర్థుల నుంచి మొత్తం 4,989 నామినేషన్లు అందినట్లు తెలిపింది.
Also Read : లింగాయత్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు