Amit Shah Mann Ki Baat : మన్ కీ బాత్ స్టాంప్..కాయిన్ విడుదల
ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అమిత్ షా
Amit Shah Mann Ki Baat : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో మన్ కీ బాత్ కు గుర్తుగా ప్రత్యేకంగా తయారు చేసిన భారత పోస్టల్ స్టాంప్ (మన్ కీ బాత్ ) , నాణేం (కాయిన్) ను విడుదల చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah Mann Ki Baat).
ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ , సమాచార ప్రసార ,యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. మన్ కీ బాత్ పేరుతో ప్రధానిగా కొలువు తీరాక మోదీ అక్టోబర్ 3, 2014న ప్రారంభించారు. ఈ నెల ఏప్రిల్ 30తో 100 ఎపి సోడ్స్ పూర్తవుతాయి. ఈ సందర్భంగా రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరించారు దేశ ఉప రాష్ట్ర పతి జగదీప్ ధన్ ఖర్.
ముఖ్యమైన ఈ మన్ కీ బాత్(Mann Ki Baat) కు గుర్తుగా రూ.100 నాణెం కూడా ఆవిష్కరించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ నాణెం చెలామణిలో ఉన్న ఇతర నాణేల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది నాలుగు లోహాలతో తయారు చేశారు. మన్ కీ బాత్ లోగోను కలిగి ఉంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 100వ ఎపి సోడ్ కోసం తాను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని చెప్పారు.
Also Read : మోదీతో భేటీ అద్భుతం – ముకుందన్