Brij Bhushan Sharan Singh : నాదే రాజ్యం నేనే సుప్రీం
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ షాకింగ్ కామెంట్స్
Brij Bhushan Sharan Singh : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను తలవంచే ప్రసక్తి లేదన్నారు. తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణల్ని కొట్టి పారేశా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు కావాలని చేస్తున్న ప్రయత్నం తప్పితే తాను అమాయకుడినని, తనకు ఏ పాపం తెలియదన్నారు. గతంలో లేని ఆరోపణలు తాజాగా చేయడం వల్ల అర్థం ఏమిటంటూ ప్రశ్నించారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh).
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా వాళ్లు గళం విప్పారు. గత కొన్నేళ్లుగా పదవిని అడ్డం పెట్టకుని మహిళా మల్ల యోధులను కావాలనే టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. ఆపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే విషయంపై తాము ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదంటూ వాపోయారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ఖాకీలు దిగి వచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) పై రెండు కేసులు నమోదు చేశారు. ఓ మైనర్ ను కూడా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉండడం విశేషం.
విచారణ ఎదుర్కొనేందుకు సిద్దమేనని, సుప్రీంకోర్టు తీర్పును తాను గౌరవిస్తానని చెప్పారు. నిజం నిలకడగా తేలుతుందన్నారు డబ్ల్యుఎఫ్ఐ చీఫ్, ఎంపీ. తాను నేరస్థుడిని కానని రిజైన్ చేసే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.
Also Read : బ్రిజ్ భూషణ్ ను తొలగించండి