Brij Bhushan Sharan Singh Comment : నా ఇష్టం నేనే సుప్రీం
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మజాకా
Brij Bhushan Sharan Singh Comment : ఎవరీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనుకుంటున్నారా. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు. రెజ్లింగ్ ఇండియా ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ గా ఉన్నాడు. గత కొంత కాలంగా మహిళా రెజ్లర్లను టార్గెట్ చేస్తూ వస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మహిళా మల్ల యోధులు రోడ్డెక్కారు. మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. తమను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh Comment) మానసికంగా, శారీరకంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ అంశం సీరియస్ గా మారడంతో కేంద్రం మేరీ కోమ్ సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
నెల రోజులు పూర్తయినా ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదు. విచిత్రం ఏమిటంటే మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించి బ్రిజ్ భూషణ్ శరణ్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించ లేదంటూ పేర్కొన్నారు. దీంతో రెజ్లర్లు మరోసారి నిరసన బాట పట్టారు. గత ఏడు రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టారు.
డబ్ల్యుఎఫ్ఐపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమకు నిరాశే ఎదురైందంటూ ఢిల్లీ పోలీసులపై ఆరోపించారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది. రెజ్లర్ల దావాను విచారించింది సీజేఐ జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం. సీరియస్ కామెంట్స్ చేశారు సీజేఐ. వాళ్లు దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
భారతీయ పతాకానికి తమ ప్రతిభా పాటవాలతో గౌరవాన్ని తీసుకు వస్తున్నారు. అలాంటి క్రీడాకారులు తాము లైంగిక వేధింపులకు గురవుతున్నామని ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) పై రెండు కేసులు నమోదయ్యాయి.
ఇందులో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం విస్తు పోయేలా చేసింది. వినేష్ ఫోగట్ , సాక్షి మాలిక్ తో సహా అగ్రశ్రేణి రెజ్లర్లకు ఆప్, కాంగ్రెస్ నేతలు అతిషి, ప్రియాంక గాంధీ మద్ధతుగా నిలిచారు. అంతకు ముందు మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ వారికి సంఘీభావం ప్రకటించారు. మాజీ భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ నిప్పులు చెరిగారు.
ఎప్పటికి న్యాయం జరుగుతుందని ప్రశ్నించాడు. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన మద్దతు తెలిపాడు. సెహ్వాగ్ కూడా వీరి జాబితాలో చేరి పోయాడు. ఇదిలా ఉండగా తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం ససేమిరా అంటున్నాడు.
తాను సుప్రీం అని, తనను తీసి వేసే అధికారం ఎవరికీ లేదంటున్నాడు. తాను సుప్రీం అని తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదంటూ ప్రకటించాడు. కేంద్రంలో, యూపీలో రాజ్యమేలుతున్న భారతీయ జనతా పార్టీ నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది. మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పిన ప్రధాన మంత్రి మహిళా రెజ్లర్ల ఊసే ఎత్తడం లేదు.
ఇక క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచారం తప్ప ఇటు వైపు చూడడం లేదు. బాధితుల ఆందోళన వల్ల దేశం పరువు పోతోందంటూ వాపోయింది పీటీ ఉష. మొత్తంగా బ్రిజ్ భూషణ్(Brij Bhushan Sharan Singh Comment) చట్టానికి అతీతుడా లేక ఆయనకు ఏమైనా రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించిందా అన్నది తేల్చాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే.
Also Read : కాంగ్రెస్ లక్ష్యం నన్ను దూషించడం