Mitchell Marsh : మిచెల్ మార్ష్ ఆల్ రౌండ్ షో
అయినా ఢిల్లీకి తప్పని ఓటమి
Mitchell Marsh : ఢిల్లీ వేదికగా జరిగిన కీలక ఐపీఎల్ లీగ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా పడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 198 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఓపెనర్ అభిషేక్ శర్మ , హెన్రిచ్ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆరంభంలోనే 4 కీలకమైన వికెట్లు కోల్పోయింది హైదరాబాద్.
ప్రధానంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ దుమ్ము రేపాడు. అటు బ్యాటింగ్ లో సత్తా చాటాడు. ఆపై బౌలింగ్ లో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. ఏకంగా 4 ఓవర్లలో 4 కీలకమైన వికెట్లను కూల్చాడు మార్ష్(Mitchell Marsh). మ్యాచ్ ను చివరి దాకా తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. గెలుపు అంచుల దాకా వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ అనుకోకుండా పరాజయం పాలైంది.
మొత్తంగా ఢిల్లీ ఓడి పోయినా మిచెల్ మార్ష్ అసాధారణమైన ఆట తీరు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మిచెల్ మార్ష్ 39 బంతులు ఎదుర్కొని ఏకంగా 63 రన్స్ చేశాడు. 27 పరుగులు మాత్రమే ఇచ్చి నలుగురిని పెవిలియన్ బాట పట్టించాడు. ఆరంభంలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో బరిలోకి వచ్చిన ఫిల్ సాల్ట్ తో కలిసి మార్ష్ 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సాల్ట్ 59 రన్స్ చేశాడు.
Also Read : విజయ్ శంకర్ షాన్ దార్ ఇన్నింగ్స్