KKR vs GT IPL 2023 : గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర
వరుసగా హ్యాట్రిక్ విక్టరీ
KKR vs GT IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది డిఫెండింగ్ ఛాంపియన్. అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ హార్దిక్ సేన సత్తా చాటింది.
బౌలింగ్ పరంగా మహ్మద్ షమీ, లిటిల్, ఆఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ రాణించారు. కోల్ కతా నైట్ రైడర్స్(KKR vs GT IPL 2023) ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఛేదనలో బ్యాటర్లు విజయ్ శంకర్ సత్తా చాటితే మరోసారి డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ ఆటతో ఆకట్టుకున్నాడు.
దీంతో 7 వికెట్ల తేడాతో కోల్ కతాను చిత్తుగా ఓడించింది. తనకు ఎదురే లేదని చాటింది. ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక 12 పాయింట్లతో అగ్ర స్థానానికి ఎగ బాకింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసింది నితీశ్ రాణా సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. కోల్ కతా బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ దుమ్ము రేపాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 39 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 7మ సిక్సర్లతో రెచ్చి పోయాడు. 81 రన్స్ చేశాడు. ఆఖర్ లో వచ్చిన ఆండ్రీ రస్సెల్ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ ఆడాడు. 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు.
అనంతరం బరిలోకి దిగిన పాండ్యా సేన ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. విజయ్ శంకర్ చుక్కలు చూపించాడు. 24 బంతులు ఆడి 2 ఫోర్లు 5 సిక్సర్లతో 51 రన్స్ చేశాడు. వ శుభ్ మన్ గిల్ 8 ఫోర్లతో 49 రన్స్ చేస్తే డేవిడ్ మిల్లర్ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 32 రన్స్ చేశారు.
Also Read : గుజరాత్ భరతం పట్టిన గుర్బాజ్