Sikandar Raza : చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చెన్నై సూపర్ కింగ్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య నువ్వా నేనా జరిగింది. చివరకు పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 4 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది.
పంజాబ్ జట్టులో ప్రభ్ సిమ్రాన్ సింగ్ , లియామ్ లివింగ్ స్టోన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సింగ్ 24 బంతులు ఆడి 42 రన్స్ చేశాడు. ఇక లియామ్ లివింగ్ స్టోన్ 24 బంతులు ఆడి 1 ఫోర్ 4 సిక్సర్లు బాదాడు. ఈ తరుణంలో విజయం ఇరు జట్ల వైపు దోబూచులాడింది.
చివరి ఓవర్ దాకా సాగింది మ్యాచ్. అటు చెన్నై గెలుస్తుందా ఇటు పంజాబ్ గెలిచి నిలుస్తుందా అన్న ఉత్కంఠకు తెర తీసింది. ఆఖరు ఓవర్ లో హీరోగా మారాడు పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సికిందర్ రజా(Sikandar Raza).
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ఆఖరి ఓవర్ లో 3 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజులో ఉన్నది సికిందర్ రాజా. చివరి బంతికి రన్స్ చేయడంతో పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. సికిందర్ రజా 7 బంతులు ఆడి 13 రన్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. జట్టుకు గెలుపు అందించిన రజా హీరోగా మారాడు.
Also Read : మెరిసిన లియామ్ లివింగ్ స్టోన్