RR vs MI IPL 2023 : ఉత్కంఠ భ‌రిత పోరులో ముంబై విక్ట‌రీ

చెల‌రేగిన టిమ్ డేవిడ్ రాజ‌స్థాన్ కు షాక్

RR vs MI IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా ముంబై లో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ చివ‌రి దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి ఓవ‌ర్ లో 17 ర‌న్స్ కావాల్సి రాగా ముంబై ఇండియ‌న్స్ ఆట‌గాడు టిమ్ డేవిడ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR vs MI IPL 2023) ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. వ‌రుస సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. దీంతో ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవంగా నిలుపుకుంది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 212 ప‌రుగులు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఆ జ‌ట్టుకు చెందిన యంగ్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ నిప్పులు చెరిగాడు. ఫోర్లు సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఒకే ఒక్క‌డు 124 ర‌న్స్ చేశాడు. ఆఖ‌రి ఓవ‌ర్ లో వెనుదిరిగాడు. జైశ్వాల్ మెరిసినా రాజ‌స్థాన్(RR vs MI IPL 2023) విక్ట‌రీ న‌మోదు చేయ‌లేక చ‌తికిల ప‌డింది.

హైద‌రాబాద్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ 29 ప‌రుగులు చేస్తే టిమ్ డేవిడ్ 45 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. అంత‌కు ముందు సూర్య కుమార్ యాద‌వ్ 55 ర‌న్స్ తో మెరిశాడు. 213 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌రో 3 బంతులు మిగిలి ఉండ‌గానే రోహిత్ సేన సూప‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం విశేషం. ఐపీఎల్ లో ఈ మ్యాచ్ 1000వ మ్యాచ్ కావ‌డం విశేషం. ఇక జైశ్వాల్ ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు 8 సిక్స‌ర్లు ఉన్నాయి. గ్రీన్ 44 ర‌న్స్ తో మెరిశాడు.

Also Read : హోరెత్తించిన య‌శ‌స్వి జైశ్వాల్

Leave A Reply

Your Email Id will not be published!