LSG vs RCB IPL 2023 : బెంగళూరు భళా లక్నో విలవిల
బౌలర్ల ప్రతాపం ఆర్సీబీ విజయం
LSG vs RCB IPL 2023 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ లో భాగంగా లక్నో వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ను 16 పరుగుల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో మరో అడుగు ముందుకేసింది.
ఇదే పిచ్ పై పరుగులు వరదలా పారాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా బౌలర్ల ప్రతాపం కొనసాగింది. ఊహించని రీతిలో పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారితే బ్యాటర్లకు షాపంగా పరిణమించింది. ఈ తరుణంలో వర్షం కూడా అడ్డంకిగా మారింది. ఆ తర్వాత మళ్లీ ఆట మొదలు పెట్టింది ఆర్సీబీ.
మ్యాచ్ లో భాగంగా బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. లక్నో బౌలర్ల దెబ్బకు విల విల లాడింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీని(LSG vs RCB IPL 2023) సాధారణ స్కోర్ కే కట్టడి చేసింది లక్నో సూపర్ జెయింట్స్ . నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి కేవలం 126 పరుగులకే పరిమితమైంది.
డుప్లెసిస్ 40 బంతులు ఆడి ఒక ఫోర్ ఒక సిక్సర్ తో 40 రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ 30 బంతులు ఆడి 31 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరు తప్ప ఇంకే బ్యాటర్ రాణించ లేదు ఆర్సీబీలో. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీస్తే రవి బిష్ణోయ్ , అమిత్ మిశ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు కుప్ప కూలింది. 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. కృష్ణప్ప గౌతమ్ ఒక్కడే 13 బంతులు ఆడి 23 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్ 2 సిక్సర్లు ఉన్నాయి. కైల్ మేయర్స్ సున్నాకే వెనుదిరిగితే ఆయుష్ బదోనీ 4, కృనాల్ పాండ్యా 14, దీపక్ హూడా 1 , పూరన్ 9, స్టోయినిస్ 13 పరుగులు చేసి నిరాశ పరిచారు.
Also Read : రాణించిన డుప్లెసిస్..విరాట్ కోహ్లీ