Ayush Badoni : ఆదుకున్న ఆయుష్ బదోని
33 బంతులు 3 ఫోర్లు 4 సిక్సర్లు 59 రన్స్
Ayush Badoni : లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కుండ పోత వర్షం కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో మ్యాచ్ ను రద్దు చేయక తప్పడం లేదని ప్రకటించారు అంపైర్లు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా టాస్ గెలిచాడు. లక్నోను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు. దీంతో అతడి నిర్ణయం సరైందేనని నిరూపించారు బౌలర్లు. అద్భుతమైన బంతులతో హోరెత్తించారు. లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
నిర్ణీత 20 ఓవర్లు ఆడాల్సి ఉండగా ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే 19.2 ఓవర్లలో 125 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయంట్స్. ఉన్నట్టుండి భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో వెంటనే ఆటను నిలిపి వేశారు అంపైర్లు.
అప్పటి దాకా లక్నో బ్యాటింగ్ చేసింది. 7 వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. సహచరులు పెవిలియన్ బాట పడితే ఆయుష్ బదోనీ(Ayush Badoni) మాత్రం చివరి దాకా ఉన్నాడు. 33 బంతులు ఎదుర్కొని 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు 4 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఇక జట్టులో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న కృనాల్ పాండ్యా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మార్కస్ స్టోయినిస్ 6 పరుగులు చేస్తే , కరణ్ శర్మ 9 , కైల్ మేయర్స్ 14, వోహ్రా 10 పరుగులకే చాప చుట్టేశారు. 44 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లక్నోను ఆదుకున్నాడు ఆయుష్ బదోని.
Also Read : కామెంటేటర్ కు ధోనీ స్ట్రాంగ్ కౌంటర్