Liam Livingstone : దంచి కొట్టిన లివింగ్ స్టోన్

రాణించినా త‌ప్ప‌ని ఓట‌మి

Liam Livingstone : మొహాలీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. పంజాబ్ , ముంబై జ‌ట్లు క‌లిసి 430 ర‌న్స్ చేశాయి. ఉత్కంఠ భ‌రిత పోరులో ముంబై ఇండియ‌న్స్ 5వ విజ‌యాన్ని న‌మోదు చేసింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. ప్లే ఆఫ్ ఆశ‌లు నిలుపుకుంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసింది శిఖ‌ర్ ధావ‌న్ సేన‌. ఆదిలోనే ఒక వికెట్ త్వ‌ర‌గా కోల్పోయినా ఆ త‌ర్వాత ధావ‌న్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. చావ్లా ఓవ‌ర్ లో సిక్స్ కొట్టిన ధావ‌న్ మ‌రో గూగ్లీ బంతికి బోల్తా ప‌డ్డాడు. మైదానంలోకి వ‌చ్చిన లియామ్ లివింగ్ స్టోన్(Liam Livingstone) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ముంబై బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. మైదానం న‌లు వైపులా క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. మొత్తం 42 బంతులు ఆడి 7 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 82 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

లివింగ్ స్ట‌న్ కు తోడుగా జితేశ్ శ‌ర్మ క‌లిశాడు. జితేశ్ శ‌ర్మ కేవ‌లం 27 బంతులు ఆడి 5 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 49 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంత‌కు ముందు శిఖ‌ర్ ధావ‌న్ 5 ఫోర్ల‌తో 30 ర‌న్స్ చేస్తే మాథ్యూ షార్ట్ 2 ఫోర్లు 1 సిక్స‌ర్ తో 27 ర‌న్స్ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 214 ర‌న్స్ చేసింది.

Also Read : ఇషాన్ కిష‌న్ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!