Ishan Kishan : ఇషాన్ కిష‌న్ సెన్సేష‌న్

41 బంతులు 7 ఫోర్లు 4 సిక్స‌ర్లు

Ishan Kishan : మొహాలీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ , ముంబై ఇండియ‌న్స్ 430 ర‌న్స్ చేశాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 214 ప‌రుగుల‌తో భారీ స్కోర్ సాధించింది.

అనంత‌రం 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది ముంబై ఇండియ‌న్స్. ఆ జ‌ట్టుకు ఈ సీజ‌న్ లో ఇది ఐద‌వ విజ‌యం. కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 216 ర‌న్స్ చేసి గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఆరంభం లోనే బిగ్ షాక్ త‌గిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గోల్డెన్ డ‌కౌట్ గా వెనుదిరిగాడు.

ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు ముంబై. ఇషాన్ కిష‌న్(Ishan Kishan) జోర్దార్ ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే సూర్యా భాయ్ తో క‌లిసి ఊచ‌కోత కోశారు. ఏం చేయాలో పాలు పోలేదు బౌల‌ర్ల‌కు.

ఇషాన్ కిష‌న్ కేవ‌లం 41 బంతులు మాత్ర‌మే ఆడి 75 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 4 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో వైపు సూర్య కుమార్ యాద‌వ్ తో క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఆ త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ(Tilak Varma) ప‌ని కానిచ్చేశాడు. ఇక సూర్య భాయ్ 31 బాల్స్ ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 66 ర‌న్స్ చేశాడు. చివ‌ర్లో వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ 10 బంతులు ఆడి 1 ఫోర్ 3 సిక్స‌ర్ల‌తో 26 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టిమ్ డేవిడ్ 10 బంతులు ఆడి 19 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి.

Also Read : జితేశ్ శ‌ర్మ జోర్దార్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!