Surya Kumar Yadav : సూర్యా భాయ్ సూప‌ర్

31 బాల్స్ 66 ర‌న్స్ 8 ఫోర్లు 2 సిక్స‌ర్లు

Surya Kumar Yadav : స్టార్ హిట్ట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ మ‌రోసారి మెరిశాడు. పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. మొహాలీ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగింది ముంబై ఇండియ‌న్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్(MI vs PBSK) జ‌ట్ల మ‌ధ్య‌.

ముంబై ముందు భారీ టార్గెట్ ఉంచింది శిఖ‌ర్ ధావ‌న్ సేన‌. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 214 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గోల్డెన్ డ‌కౌట్ గా వెనుదిరిగాడు. దీంతో ఒడిదుడుకుల‌కు లోనైంది. కానీ ఆ త‌ర్వాత ఎక్క‌డా త‌గ్గ‌లేదు ముంబై ఇండియ‌న్స్. ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ రెచ్చి పోతే సూర్య కుమార్ యాద‌వ్ త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. పంజాబ్ బౌల‌ర్ల‌ను ఈ ఇద్ద‌రు క‌లిసి ఊచ కోత కోశారు.

ఇషాన్ కిష‌న్ 41 బంతులు మాత్ర‌మే ఆడి 75 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 4 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో వైపు సూర్య కుమార్ యాద‌వ్ తో క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కూర్చుని షాట్స్ కొట్ట‌డంలో త‌న‌కు తానే సాటి అని మ‌రోసారి నిరూపించుకున్నాడు సూర్యా భాయ్(Surya Kumar Yadav).

ఆ త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ ప‌ని కానిచ్చేశాడు. ఇక సూర్య భాయ్ 31 బాల్స్ ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 66 ర‌న్స్ చేశాడు. చివ‌ర్లో వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ 10 బంతులు ఆడి 1 ఫోర్ 3 సిక్స‌ర్ల‌తో 26 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టిమ్ డేవిడ్ 10 బంతులు ఆడి 19 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. 6 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. టోర్నీలో 5వ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Also Read : దంచి కొట్టిన లివింగ్ స్టోన్

Leave A Reply

Your Email Id will not be published!