SRH vs KKR IPL 2023 : హైదరాబాద్ మెరిసేనా కోల్ కతా గెలిచేనా
కీలక పోరుకు ఇరు జట్లు రెఢీ
SRH vs KKR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో మరో కీలక మ్యాచ్ కు వేదిక కానుంది హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య గురువారం జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం. ఈ మ్యాచ్ 47వది.
ఇప్పటి దాకా కోల్ కతా నైట్ రైడర్స్ 9 మ్యాచ్ లు ఆడింది. 3 మ్యాచ్ లలో గెలుపొంది ఆరు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్ లు ఆడింది. 3 మ్యాచ్ లలో గెలుపొంది ఆరు పాయింట్లు సాధించింది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాలి ఇరు జట్లు.
ఇక ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇప్పటి దాకా 68 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 30 మ్యాచ్ లలో విజయం సాధించగా రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 38 మ్యాచ్ లలో గెలుపొందాయి. సన్ రైజర్స్ ఆర్సీబీపై 231 పరుగులు చేసింది. ఇదే అత్యధిక స్కోర్. ఇక అత్యల్ప స్కోర్ ఢిల్లీ చేసింది హైదరాబాద్(SRH vs KKR IPL 2023) తో కేవలం 80 పరుగులే చేసింది.
కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 24 మ్యాచ్ లు జరిగాయి. హైదరాబాద్ 9 సార్లు గెలిస్తే కోల్ కతా 15 సార్లు విజయం సాధించాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది అభిమానుల్లో. ఇదిలా ఉండగా మ్యాచ్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ట్రాఫిక్ ను దారి మళ్లించారు.
Also Read : చెలరేగిన ముంబై తలవంచిన పంజాబ్