Rakesh Tikait : కేంద్ర సర్కార్ పై టికాయత్ కన్నెర్ర
మహిళా మల్ల యోధులకు మద్ధతు
Rakesh Tikait : భారతీయ కిసాన్ యూనియన్ అగ్ర నేత రాకేశ్ టికాయత్(Rakesh Tikait) నిప్పులు చెరిగారు. మహిళా మల్ల యోధుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను వెంటనే తొలగించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన మహిళా రెజర్లను రాకేశ్ టికాయత్ పరామర్శించారు. సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా రైతు అగ్ర నేత సంచలన కామెంట్స్ చేశారు. మహిళా రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డెక్కారని, ఈ దేశంలో నిరసన తెలపడం కూడా నేరంగా మారిందని మండిపడ్డారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను ఎందుకు వెనకేసుకు వస్తున్నారంటూ నిలదీశారు రాకేశ్ టికాయత్(Rakesh Tikait). ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు. ఆడబిడ్డలకు తాము రక్షణగా ఉంటామని ప్రకటించారు. వెంటనే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించాలని, ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రైతు అగ్ర నేత.
Also Read : మహిళా రెజ్లర్లపై దాడి సిగ్గుచేటు