Wriddhiman Saha : రాణించిన వృద్దిమాన్ సాహా
34 బాల్స్ 5 ఫోర్లు 41 రన్స్
Wriddhiman Saha : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన 48వ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపింది. సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ బౌలర్లు కళ్లు చెదిరే బంతులతో ఆకట్టుకున్నారు. ఆప్గనిస్తాన్ బౌలర్ల ధాటికి కుప్ప కూలారు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ 2 వికెట్లు , షమీ, లిటిల్ , పాండ్యా చెరో వికెట్ తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే రాజస్థాన్ 17.5 ఓవర్లకే చాప చుట్టేసింది. కేవలం 118 పరుగులకే పరిమితమైంది.
అనంతరం మైదానంలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఓపెనర్ , వికెట్ కీపర్ వృద్ది మాన్ సాహా(Wriddhiman Saha) సూపర్బ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మొత్తం 34 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 41 రన్స్ చేశాడు. శుభ్ మన్ గిల్ 35 బంతులు ఎదుర్కొని 34 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. ఆ ఒక్క వికెట్ యుజ్వేంద్ర చాహల్ కు దక్కింది.
అద్బుతమైన బంతికి ఆడ బోయిన సంజూ శాంసన్ స్టంట్ చేయడంతో శుభ్ మన్ గిల్ వెనుదిరిగాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెచ్చి పోయాడు. వచ్చీ రావడంతోనే ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 15 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 3 ఫోర్లు 3 సిక్స్ లతో 39 రన్స్ చేశాడు. పని పూరర్తి కానిచ్చేశాడు.
Also Read : రషీద్ ఖాన్ కమాల్ రాజస్థాన్ ఢమాల్