Imran Khan : బిలావల్..షెహబాజ్ పై ఇమ్రాన్ కన్నెర్ర
ఇండియా టూర్ పై మాజీ పీఎం ఆగ్రహం
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) నిప్పులు చెరిగారు. భారతదేశంలో 12 ఏళ్ల తర్వాత పర్యటించిన పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ లాహోర్ లో తన నివాసం లోపల నుండి పీటీఐ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇద్దరు నేతలను లక్ష్యంగా చేసుకున్నారు.
ప్రస్తుత పీఎం షెహబాజ్ షరీఫ్ , విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోలను టార్గెట్ చేశారు. పాక్ పీఎం కింగ్ చార్లెస్ -3 ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనగా భారత్ లోని గోవాలో జరుగుతున్న జి20, ఎస్ సిఓ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదంతో పాటు టెర్రరిస్టులకు ప్రతినిధిగా బిలావల్ భుట్టో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ పలచ బడింది. మీరు , పీఎం దేని కోసం వెళ్లారని ప్రశ్నించారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
ఈ టూర్ వల్ల లాభం ఎంత నష్టం ఎంత అని నిలదీశారు. భారత పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందారంటూ నిప్పులు చెరిగారు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని ఇందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేయాలని జై శంకర్ స్పష్టం చేశారు.
Also Read : అమెరికాలో కాల్పుల మోత